You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగు సినీ పరిశ్రమ: కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టుల కలలు.. కన్నీళ్లు
కరోనావైరస్ లాక్‌డౌన్ సినిమా రంగంలోని చిన్న ఆర్టిస్టులను, టెక్నీషియన్లను సంక్షోభంలో పడేసింది. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో వీరు ఎక్కువగా నివసిస్తుంటారు. వారితో బీబీసీ మాట్లాడింది. ఎవరిని కదిలించినా గొంతులో విషాదమే ధ్వనించింది.
కరోనావైరస్ ప్రభావంతో సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చిక్కుకున్నారు. సినిమా పెద్దల నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, ఈ సహాయం ఎన్ని రోజులు ఉంటుందన్న ప్రశ్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
"మెట్రో డైలీ కూలీకి వెళ్లే వాళ్ళలాగే ఉంటుంది మా జీవితాలు కూడా అంతే. రోజూ పనికి వెళితేనే సాయంత్రం డబ్బు చేతికి వస్తుంది. కరోనా లాక్‌డౌన్ విధించిన తరువాత మొదటి రెండు నెలలు బాగానే గడిచాయి. కానీ, ఇప్పుడు పని లేదు. బతకడమే కష్టంగా మారింది. నాలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది" అని మహిళా ఆర్టిస్ట్ వాసవి అన్నారు.
షూటింగులు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పెద్ద తారల చిత్రాలే సెట్స్‌లోకి వెళ్లలేని పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)