కరోనా రోగులకు వయొలిన్ గానంతో సాంత్వన కలిగిస్తున్న నర్సు

ప్రచురణ

కరోనా మహమ్మారి మీద పోరాటంలో వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు.

అలా చిలీలో కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఒక నర్సు.. క్రిటికల్ కేర్‌ చికిత్స పొందుతున్న రోగులకు వయొలిన్ మీద సంగీతం వినిపిస్తూ సాంత్వన అందిస్తున్నారు.

వారానికి రెండు సార్లు తన విధులు ముగిసిన తర్వాత క్రిటికల్ కేర్ విభాగంలో వయొలిన్ మీద లాటిన్ గీతాలను పలికిస్తున్నారామె.

ఆ రోగులకు ప్రేమాభిమానాలు, ఆశానురక్తులు అందించటం తన ఉద్దేశమని దామరిస్ సిల్వా చెప్తున్నారు.

ఈ పని తన మనసుతో చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)