You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హయా సోఫియా: ఒకప్పుడు చర్చి, మసీదు, మ్యూజియం.. మళ్లీ మసీదుగా మారుస్తారా?
ఇస్తాంబుల్‌లోని చారిత్రక కట్టడం హయా సోఫియాను మసీదుగా మార్చాలనే ప్రతిపాదనపై తీసుకోవలసిన నిర్ణయాన్ని టర్కీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వాయిదా వేసింది.
17 నిమిషాల పాటు సాగిన విచారణ అనంతరం మరో 15 రోజుల్లో తీర్పుని ప్రకటిస్తామని టర్కీ అత్యున్నత కార్యనిర్వాహక సంస్థ తెలిపింది
1500 సంవత్సరాల పురాతనమైన ఈ కట్టడాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది 1930 లలో మ్యూజియంగా మారక ముందు మసీదుగా, అంత కన్నా ముందు చర్చి గా ఉండేది.
కోర్టు అంగీకరిస్తే ఇది మళ్ళీ మసీదుగా మారే అవకాశం ఉంది.
గత సంవత్సరం జరిగిన ఎన్నికల ప్రచారంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ దీనిని మసీదుగా మార్చాలనే ప్రతిపాదనను తెచ్చారు.
ఇస్లాం మద్దతుదారులు దీనిని ఎప్పటినుంచో మసీదుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సెక్యులర్ వర్గాలు ఈ డిమాండ్ ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ ప్రతిపాదన అంతర్జాతీయ రాజకీయ, మత నాయకుల విమర్శలు ఎదుర్కొంది.
గ్రీస్ సాంస్కృతిక శాఖా మంత్రి లీన మెండోని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. టర్కీ ప్రభుత్వం జాతీయ, మత వాదాన్ని ప్రేరేపిస్తోందని ఆమె ఆరోపించారు.
ప్రస్తుతం మ్యూజియంగా కొనసాగుతున్న హయా సోఫియాను మసీదుగా మార్చాలంటే అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించాలని యునెస్కో డెప్యుటీ డైరెక్టర్ ఎర్నెస్టో ఒట్టోన్ రామిరెజ్ గ్రీక్ వార్తా పత్రిక టా నియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఈ ప్రతిపాదనపై యునెస్కో టర్కీకి లేఖ రాసిందని, కానీ వారినుంచి ఎటువంటి జవాబూ రాలేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా, బ్రిటన్ మధ్య ‘హాంకాంగ్’ చిచ్చు... ప్రపంచ క్రమం మారిపోతుందా?
- నాగాలాండ్, మిజోరంలలో కుక్క మాంసాన్ని ఇప్పుడే ఎందుకు నిషేధించారు?
- సూర్యుడి కన్నా 25 లక్షల రెట్ల పెద్దదైన రాకాసి నక్షత్రం.. రాత్రికి రాత్రి రాలిపోయిందా?
- ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది - ఎలా మార్చింది.. చరిత్రలో ఏం జరిగింది?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)