బీబీసీ లైవ్‌షోలో మాట్లాడుతున్న అమ్మను కూతురు ఎలా ఇబ్బంది పెడుతోందో చూడండి.. - Work From Home కష్టాలు
డాక్టర్ క్లారే వెన్హమ్ బీబీసీ న్యూస్ చానెల్ లైవ్‌లో లండన్‌లో లాక్‌డౌన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ఆమె కూతురు ఆ గదిలోకి, లైవ్‌లోకి వచ్చారు.
వాస్తవానికి డాక్టర్ వెన్హమ్ ఈ మధ్యనే కోవిడ్-19 మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, ఆ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాల్సి వస్తుందో వివరిస్తూ బ్రిటిష్ మెడికల్ జర్నల్‌కు ఒక వ్యాసాన్ని రాశారు. లింగ సమానత్వానికి కూడా ఈ మహమ్మారి సహాయం చేస్తుందని ఆ వ్యాసంలో డాక్టర్ వెన్హమ్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఆ వ్యాసంలో పేర్కొన్నట్లుగా తాను కూడా ఇలా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమన్వయం చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని లైవ్ షో తర్వాత ఆమె అన్నారు.
ఇంతకీ అమ్మను కూతురు ఎందుకు, ఎలా ఇబ్బంది పెట్టిందో, బీబీసీ ప్రజెంటర్‌తో ఎలా మాట్లాడిందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది
- లాక్‌డౌన్: రాత్రింబవళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎందుకు చూస్తాం? టీవీకి ఎందుకు అతుక్కుపోతాం?
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడొద్దు.. మగవాళ్లకు లేనప్పుడు మాకెందుకు?’
- లైవ్ టీవీ షోలో తండ్రిని ఇబ్బందులు పెట్టిన పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)