థాయ్‌లాండ్ - లోప్‌బురి: మనిషి అడుగు పెట్టాలంటే భయంతో వణికే కోతుల రాజ్యం
థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి నగరంలో కోతులదే రాజ్యం.
ఇక్కడ ఉండే పొడవు తోకల కోతులు ఒకప్పుడు పర్యాటక ఆకర్షణ. కానీ, ఇప్పుడు అక్కడ వాటి ఆధిపత్యం ఎక్కువైపోయింది.
కరోనావైరస్ కారణంగా పర్యటకుల రాక ఆగిపోవడంతో వారు ఇచ్చే అరటి, ఇతర పండ్లు వాటికి దొరకడం లేదు.
దీంతో అవి జంక్ ఫుడ్ తింటున్నాయి. ఆహారంలో మార్పు రావడంతో వాటిలోనూ మార్పులొస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
లోప్‌బురిలోని ఆలయంలో 6 వేల కోతులుంటాయి. అక్కడ ఎవరూ అడుగు పెట్టే పరిస్థితి లేదు. వాటిదే ఆధిపత్యం.
ఇక పాత సినిమా థియేటర్ కూడా వాటికి మరో ఆవాసం. అందులోని ప్రొజెక్టర్ రూమ్ ఆ కోతుల స్మశానం. ఏ కోతయినా చనిపోతే మిగతావి ఆ కళేబరాన్ని తీసుకెళ్లి ఆ గదిలో ఉంచుతున్నాయి.
ఇప్పుడు ఈ పాత సినిమా థియేటర్‌లోకి కూడా ఎవరినీ రానివ్వడం లేదు అవి.
కోతుల సంతానం విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించే పనిలో పడింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)