భారత్ – చైనా సరిహద్దు వివాదం: సైనికులకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా

వీడియో క్యాప్షన్, భారత్ – చైనా సరిహద్దు వివాదం: సైనికులకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా
ప్రచురణ

చైనా త‌న సైనిక బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీఠభూమికి 20 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్న‌ట్లు తెలిపింది.

దీనికి వెనుక గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే ల‌ద్దాఖ్‌లోని గల్వ‌ాన్ లోయ‌లో జ‌రిగిన‌‌ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు మ‌ర‌ణించిన అనంత‌రం తాజా ప‌రిణామం చోటుచేసుకుంది.‌

1996లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించ‌కూడ‌దు.

ఘ‌ర్ష‌ణ‌లో త‌మ వైపు ఎంత మంది మ‌ర‌ణించారో చైనా వెల్ల‌డించ‌లేదు. అయితే, 20 మంది త‌మ సైనికులు అమ‌రుల‌య్యార‌ని, 76 మందికి గాయాల‌య్యాయ‌ని భార‌త్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)