సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కి ఉందా?

వీడియో క్యాప్షన్, సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కి ఉందా?
ప్రచురణ

అమెరికాలో నిరసనలను అదుపు చేయడానికి సైన్యాన్ని దింపుతానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో సైన్యాన్ని దించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా?

తెల్లజాతి పోలీసు అధికారి మోకాలి కింద నలిగి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత చెలరేగిన ఆందోళనలు అమెరికా మొత్తానికి వ్యాపించాయి. అనేక ప్రదేశాల్లో ఆస్తుల విధ్వంసాలు, లూటీలు జరిగాయి.

ఈ ఆందోళనలను అదుపుచేయడానికి అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్ హెచ్చరించారు. రాష్ట్రాలు ఈ నిరసనలను అదుపుచేయడంలో విఫలమైతే తాను సైన్యాన్ని ఆ ప్రాంతాలకు పంపుతానన్నారు.

రాష్ట్ర అధికార యంత్రాంగం అనుమతి లేకుండా ఆయా రాష్ట్రాలకు సైన్యాన్ని పంపించే అధికారం ప్రభుత్వానికి లేదని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)