ప్రైవేటు రోదసినౌకలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వ్యోమగాములు
ప్రైవేటు వ్యోమనౌక 'క్రూ డ్రాగన్'లో పయనమైన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరారు. అక్కడ ఉన్న రష్యా, అమెరికా వ్యోమగాములను వీరు కలిశారు. బాబ్ బెంకన్, డగ్ హార్లీ ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లగానే అక్కడున్న వారు వీరిని ఆలింగనం చేసుకున్నారు. కరచాలనం చేస్తూ వీరికి స్వాగతం పలికారు.ఆదివారం 'క్రూ డ్రాగన్' క్యాప్సూల్ ఐఎస్ఎస్‌తో అనుసంధానమైనట్లు నాసా తెలిపింది. బాబ్, డగ్ ప్రమేయం లేకుండానే 'ఆటోమేటెడ్' విధానంలో ఈ అనుసంధానం జరిగింది. స్పేస్ఎక్స్ అంతరిక్షనౌక 'క్రూ డ్రాగన్'ను అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి తొలిసారిగా ఇలాంటి మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు.ప్రైవేటు వ్యోమనౌకతో వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు పంపించడం ఇదే మొదటిసారి.వీరిద్దరిని ఈ మిషన్ కోసం 2000లో ఎంపిక చేశారు. వీరి ప్రయాణానికి దాదాపు 19 గంటలు పట్టింది.ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)