భూకంపంలోనూ ఇంటర్వ్యూ ఆపని న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్.. ఒక టీవీ చానల్'కు ఇంటర్వ్యూ ఇస్తున్నపుడు ఆ దేశంలో భూకంపం వచ్చింది. అయినా ఆమె ఇంటర్వ్యూను ఆపేయకుండా కొనసాగించారు.
''ఇక్కడ చిన్నపాటి భూకంపం వస్తోంది రియాన్. బాగానే కంపిస్తున్నట్లు అనిపిస్తోంది. నా వెనుక వస్తువులు కదలటం మీకు కనిపిస్తోందా?'' అని ఆమె తనను ఇంటర్వ్యూచేస్తున్న విలేకరితో పేర్కొన్నారు.
''ప్రధానమంత్రి గారు భూకంపం ఆగిందా లేక ఇంకా కంపిస్తోందా?'' అని ఆ విలేకరి అడిగినపుడు ''హా.. ఇప్పుడు ఆగింది'' అని కూడా చెప్పారు.
''వ్యాఖ్యాత మీరు క్షేమంగా ఉన్నారా? ఇంటర్వ్యూ కొనసాగించగలరా?'' అని విలేకరి అడిగితే.. ''మాకేం కాలేదు రియాన్. మేము మామూలు ప్రదేశంలో లేము. బాగా దృఢంగా కట్టిన భవనంలో ఉన్నాం'' అని ప్రధాని జసిందా బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- రంగనాయకమ్మ అరెస్ట్ వివాదం: ఆమె ఫేస్‌బుక్ పోస్టులో ఏముంది? ఏం కేసు పెట్టారు?
- హైకోర్టుకు చేరిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వివాదం ఏమిటి? ఎందుకు?
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- భారత్ - పాక్ సరిహద్దులో స్థానికులు పట్టుకున్న ఈ పావురం పొరుగు దేశపు గూఢచారా?
- 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను'.. పాకిస్తాన్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)