వీడియో: కరాచీలో ఇళ్ల మీద కూలిన పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ విమానం

ప్రచురణ

పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలో ఒక కాలనీ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు.

ఈ విమానంలో మొత్తం 99 మంది ఉన్నారు. అయితే, 30 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.

పాకిస్తాన్‌లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్ అనంతరం వాణిజ్య కార్యకలాపాల కోసం విమానాలను అనుమతించిన కొన్ని రోజులకే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)