You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయ్ మాల్యా: భారత్‌కు తనను అప్పగించ వద్దంటూ వేసిన పిటిషన్ కొట్టివేసిన బ్రిటన్ కోర్టు
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను యూకే హైకోర్టు కొట్టివేసింది.
లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, ఎలిసబెత్ లెయింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఈమెయిల్ ద్వారా మాల్యాకు అందజేసింది.
అయితే, సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ చేసుకునేందుకు అనుమతి కోసం 14 రోజుల గడువు ఉంది.
ఆ గడువులోగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లకుంటే, ఈ కోర్టు ఉత్తర్వులు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ వద్దకు వెళ్తాయి. వాటిపై సంతకం చేసేందుకు ఆమెకు మరో 28 రోజుల గడువు ఉంటుంది. హోంమంత్రి సంతకం చేశాక మాల్యాను భారత్‌కు అప్పగిస్తారు.
ఒకవేళ, ఆయన బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తే మాత్రం తదుపరి తీర్పు వచ్చే వరకూ వేచిచూడాల్సి ఉంటుంది.
భారత్‌లో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పరారైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ 2018 డిసెంబర్‌లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మాల్యా పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను అప్పగించాలని కోరుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- మాల్యాను భారత్‌కి అప్పగిస్తే ఏ జైల్లో పెడతారు.. వీడియో తీసి పంపించండి : లండన్ కోర్టు
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- కరణ్ థాపర్‌పై నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?
- మీకు ప్రభుత్వం నేరుగా డబ్బిస్తే మంచిదేనా, కాదా?
- కరోనా లాక్డౌన్: మూడు నెలలు ఈఎంఐ వాయిదా వేసుకోవడం మంచిదేనా?
- కరోనావైరస్: రుణాల చెల్లింపులపై ఆర్బీఐ మారటోరియం - ఈఎంఐ కట్ అవుతుందా? వాయిదా వేయటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)