వీడియో: రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని మడగాస్కర్ రైతులు ఎందుకు అంటున్నారు..

ప్రచురణ

మడగాస్కర్‌లో కొత్త రాజధాని నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి టానా మాసువాండ్రా అని పేరు పెట్టారు.

ప్రస్తుత రాజధాని అంటానిరివోకు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రాలను వేరే చోటుకు తరలించి, ఆ స్థానంలో దీన్ని నిర్మించాలని భావిస్తోంది.

అయితే, ఆ భూములు అప్పగించేందుకు రైతులు అంగీకరించడం లేదు.

రైతుల ఇచే ఒక్కో భూమికి ఐదు రెట్ల స్థలాన్ని బెవోయ్ అనే ప్రాంతంలో వారికి కేటాయిస్తామని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ అంటున్నారు.

కానీ, ఆ ప్రాంతం ఇప్పుడున్న రాజధానికి 700 కి.మీ.ల దూరంలో ఉంది. అందుకే, అక్కడికి తరలివెళ్లేందుకు రైతులు ఇష్టపడటం లేదు.

ఈ విషయం గురించి సమగ్ర కథనాన్ని పైనున్న వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)