వీడియో: మతం పేరుతో లైంగిక దోపిడీ... మత గురువులే మధ్యవర్తులుగా 'సుఖ వివాహాలు': బీబీసీ రహస్య పరిశోధన

వీడియో క్యాప్షన్, మతం పేరుతో లైంగిక దోపిడీ... మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’: బీబీసీ రహస్య పరిశోధన
ప్రచురణ

ఇరాక్‌లో మత గురువులు బాలికలను ఉంపుడుగత్తెలుగా మారుస్తున్నారని... షియా ఆచారమైన తాత్కాలిక 'సుఖ వివాహం' మీద బీబీసీ న్యూస్ అరబిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది.

ఇరాక్‌లో అత్యంత ప్రముఖ మత కేంద్రాల వద్ద మత గురువులు నిర్వహిస్తున్న వివాహ కార్యాలయాల మీద బీబీసీ రహస్యంగా పరిశోధన నిర్వహించింది.

బీబీసీ మాట్లాడిన వారిలో చాలా మంది మత గురువులు.. బాలికలతో తాత్కాలిక 'సుఖ వివాహం' జరిపించటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సెక్స్ చేయటానికి వీలుగా అతి తక్కువ కాలం పాటు గంట సమయానికి కూడా ఈ 'పెళ్లి' చేయటానికి వారు ముందుకు వచ్చారు.

ఇలాంటి తాత్కాలిక పెళ్లిళ్లకు మహిళలతో పాటు చిన్న వయసు బాలికలను కూడా చివరికి తొమ్మిదేళ్ల బాలికలను కూడా 'వధువులు'గా సరఫరా చేస్తామని చెప్పారు.

మత గురువులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని, చిన్నారులపై లైంగిక దుశ్చర్యలకు మతపరంగా అండదండలు అందిస్తున్నారని ఈ డాక్యుమెంటరీ వివరిస్తోంది.

ఈ మతాచారంపై ఇరాక్, బ్రిటిష్ బీబీసీ జర్నలిస్టుల బృందం 11 నెలల పాటు రహస్యంగా పరిశోధన నిర్వహించింది. మత గురువులను సంప్రదించింది. లైంగిక దోపిడీకి గురైన మహిళలను కలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)