హంగ్ కాంగ్ నిరసనలు: చైనా కమ్యూనిస్టు పాలన 70వ వార్షికోత్సవం.. ‘హాంగ్ కాంగ్‌లో అత్యంత హింసాత్మక దినం’
హాంగ్ కాంగ్‌లోని త్సూన్ వాన్ జిల్లాలో నిరసనకారులు ఓ పోలీసును కొడుతున్నపుడు.. మరొక పోలీస్ అధికారి తన హ్యాండ్‌గన్‌తో ఒక లైవ్ బులెట్‌ను పేల్చాడు.
ఓ 18 ఏళ్ల యువకుడి ఛాతీలో ఆ బులెట్ కాల్చాడు. మూడు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనల్లో మొదటి తూటా గాయమిది.
విషమ పరిస్థితిలో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన చైనాలో కమ్యూనిస్టు పాలన 70వ వార్షికోత్సవం నాడు జరిగింది. ఆ రోజు బ్లాక్ డేగా పాటిస్తూ హాంగ్ కాంగ్‌లో శాంతియుతంగానే నిరసన ప్రదర్శన మొదలుపెట్టారు.
ఆందోళనకారులతో నగర వీధులు నిండిపోయాయి. తమకు మద్దతివ్వాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
అధికారిక బ్యానర్లను చింపివేసి దహనం చేశారు. ఇది సంతాప దినమని నిర్వాహకులు అభివర్ణించారు.
కానీ ఇది అత్యంత హింసాత్మక దినంగా కూడా మారింది.
నగరమంతటా నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు ప్రయోగించారు.
బీజింగ్‌లోని అధికారులు శాంతియుత పునరేకీకరణ గురించి మాట్లాడారు.
కానీ హాంగ్ కాంగ్ వీధుల్లో వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- బోటు వెలికితీతలో ఆటంకాలు.. తెగిన ఇనుప తాడు, వంగిన లంగరు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)