వీడియో: కేరళ వరదలు.. సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న వాలంటీర్లు
కేరళ వరద సహాయ చర్యల్లో వాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. శిబిరాల్లో బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గడంతో సహాయ శిబిరాల నుంచి ప్రజలు వారి ఇళ్లకు వెళ్తున్నారు.
అవసరమైన వారికి ఇల్లు శుభ్రం చేసేందుకు కూడా వాలంటీర్లు ముందుకు వస్తున్నారు.
మలప్పురానికి చెందిన సాదిక్ స్నేహితులతో కలిసి ఇళ్లు శుభ్రం చేయడానికి కావాల్సిన సామగ్రి కొని, ఒక బండి తీసుకొని దాదాపు 15 మంది నివాసాలకు వెళ్లి సేవలు అందిస్తున్నారు.
"మాలో కొంత మంది విద్యార్థులు, మరి కొంత మంది సొంత వ్యాపారాలున్నవారు ఉన్నారు. రెండు రోజులుగా మేం ఇదే పనిలో ఉన్నాం" అని సాదిక్ చెప్పారు.

వరదల్లో చనిపోయినవారి సంఖ్య 102కి చేరింది.
మలప్పురం జిల్లాలోని కావలప్పరలో కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లింది. అక్కడ మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. 30 మందికి పైగా గ్రామస్థులు ఇంకా శిథిలాల కింద ఉండిపోయారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
- ‘హత్తుకొని పడుకునే ఆ పిల్లలు... అలాగే ప్రాణాలొదిలారు’
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- పని చేయాలంటే విసుగొస్తోందా? పరిష్కారాలేమిటి?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)