వీడియో: #INDvSL మ్యాచ్ చూస్తుంటే విమానం శబ్ధం వినిపిస్తోంది.. ఆ విమానం ఇదే

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌కు న్యాయం
ప్రచురణ

హెడింగ్లేలో భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఒక చిన్నపాటి విమానం మైదానానికి సమీపంలో ఎగురుతోంది.

టీవీ, మొబైల్ ఫోన్లలో క్రికెట్ చూస్తున్నవారంతా.. కామెంట్రీ సందర్భంగా ఈ విమానం శబ్ధాన్ని వింటున్నారు.

ఆ విమానానికి #JusticeForKashmir (కశ్మీర్‌కు న్యాయం) అని రాసి ఉన్న బ్యానర్ కట్టారని హెడింగ్లే నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ చెప్పారు.

అయితే, ఈ విమానాన్ని ఎవరు నడుపుతున్నారు? ఇలా ఎందుకు బ్యానర్ కట్టారు అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

అయితే, ఈ హ్యాష్ ట్యాగ్ మాత్రం ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)