You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విడిపోయిన ప్రేమజంట 75 ఏళ్ల తర్వాత కలుసుకుంది
రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయిన ఒక ప్రేమ జంట కథ. ఇక తామెన్నటికీ కలవలేమనుకున్న వీరు, 75 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోగలిగారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, 1944లో కేటీ రాబిన్స్ అనే అమెరికా సైనికుడు ఉద్యోగ రీత్యా ఫ్రాన్స్‌లోని ఓ గ్రామంలో కొన్నాళ్లున్నారు. అక్కడే ఆయనో ఫ్రెంచ్ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత రాబిన్స్ వేరే చోటకు వెళ్లిపోయారు.
నాటి సైనికులపై ఇటీవల ఓ చిత్రం నిర్మాణం జరుగుతుండగా, రాబిన్స్ తాను ఇష్టపడ్డ మహిళ ఫొటోను ఫ్రాన్స్ జర్నలిస్టులకు చూపించారు.
ఆమెను, ఆమె కుటుంబాన్ని కలుసుకోవడానికి ఫ్రాన్స్ వెళ్లడానికైనా తాను సిద్ధమేనని ఆయన వాళ్లతో చెప్పారు.
కొద్ది వారాల తర్వాత రాబిన్స్, రెండో ప్రపంచ యుద్ధంలో కీలక ఘట్టంగా భావించే డీ-డే 75వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లారు.
అప్పుడు ఆ జర్నలిస్టులు ఆయన్ను ఆశ్చర్యపరిచారు.
రాబిన్స్ ఇష్టపడ్డ మహిళ పేరు జీనైన్ గనాయే. ఫ్రెంచి జర్నలిస్టులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
రాబిన్స్, జీనైన్ ఇద్దరూ ఫ్రాన్స్‌లో మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేశారు.
"ఆమె ఇంకా బతికే ఉన్నారు, మీ కోసం ఎదురుచూస్తున్నారు" అని రాబిన్స్‌తో చెబితే, "నన్ను ఆట పట్టించకండి. ఎవరైనా దీన్ని నమ్ముతారా" అని ఆయన అన్నారు.
తర్వాత జీనైన్ నివసిస్తున్న రిటైర్మెంట్ హోమ్‌లో వాళ్లిద్దరూ కలుసుకున్నారు.
"నేనెప్పుడూ రాబిన్స్ గురించే ఆలోచించేదాన్ని. బహుశా అతనొస్తాడని అనుకునేదాన్ని. అతడి గురించి ఎప్పుడూ అడుగుతుండేదాన్ని" అని ఆయన జీనైన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: చమురు ట్యాంకర్ల పేలుళ్ళ వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అమెరికా
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై ఏమన్నాడంటే...
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- ‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’: ఉబర్
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేయనున్న ఏడు కీలక శక్తులు
- కోర్టులకు వేసవి సెలవులు అవసరమా...
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)