గ్రామస్థులకు ప్రత్యేకమైన పోటీ పెట్టిన సర్పంచ్, విజేతకు బంగారు నాణెం
ప్రచురణ
కశ్మీర్‌లోని ఒక గ్రామ సర్పంచ్ తమ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ఒక ప్రత్యేక పోటీని నిర్వహించారు.
ఎక్కువ చెత్త సేకరించినవారికి బంగారు నాణెం బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఇద్దరు యువకులు ఈ పోటీలో బంగారు నాణేలు గెలుచుకున్నారు. ఈ పోటీ, గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కారణమైంది.
వీడియో- రియాజ్ మస్రూర్, షఫత్ ఫరూక్