బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ వినేశ్ ఫోగట్

వీడియో క్యాప్షన్, బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ వినేశ్ ఫోగట్
ప్రచురణ

రెజ్లింగ్‌లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫోగట్. కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌ రెండింట్లో బంగారు పతకాన్ని పొందిన తొలి భారతీయ రెజ్లర్‌ కూడా ఆమే.

వినేశ్ కామన్‌వెల్త్ గేమ్స్‌తో తన పేరుపై వరుసగా మూడు బంగారు పతకాలను పొందారు. ఈ మెడల్స్ భిన్నమైన వెయిట్ కేటగిరీల్లో వచ్చాయి. తాజాగా 53 కేజీల బరువు విభాగంలో 2022 ఆగస్టులో కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

వినేశ్ ఫోగట్ మహిళా రెజ్లర్ల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె కజిన్లు గీతా, బబితా ఫోగట్‌లు కూడా పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)