బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ సాక్షి మాలిక్
ప్రచురణ
58 కేజీ వెయిట్ కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించారు.
ఒలింపిక్ పతకం పొందిన నాలుగవ భారతీయ మహిళా ఈమె కావడం విశేషం. సాక్షికి క్రీడలంటే ఎంతో ఇష్టం. తన తాత రెజ్లర్ అని తెలుసుకున్న తర్వాత ఆమె ఎంతో స్ఫూర్తిని పొందారు. రియో ఒలింపిక్స్‌లో మెరిసిన తర్వాత, సాక్షి కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ, ఏ మాత్రం అధైర్యపడకుండా 2022లో బర్మింగ్హమ్ కామన్‌వెల్త్ క్రీడల్లో బంగార పతకాన్ని గెలుచుకోవడం ద్వారా మరోసారి మెరిశారు. అంతకుముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో సాక్షి మాలిక్ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- వికారాబాద్‌లో జరిగింది మత ఘర్షణేనా? బీబీసీ కవరేజీలో బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాలివే...
- తుర్కియేలో రెండో భూకంపం... వేయి మంది మృతి తరువాత మరో విధ్వంసం
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)