బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ పీవీ సింధు

వీడియో క్యాప్షన్, బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ పీవీ సింధు
ప్రచురణ

ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలను పొందిన తొలి భారతీయ మహిళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.

టోక్యో గేమ్స్‌లో తన రెండో ఒలింపిక్ పతకంగా కాంస్యం పొందారు. 2016లో రియో గేమ్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సింధు సాధించారు.

అంతకుముందు 2021లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.

2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలిగా సింధు నిలిచారు.

17 ఏళ్ల వయసులోనే సెప్టెంబర్ 2012లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో చోటు దక్కించుకున్నారు.

ప్రజా ఓటింగ్‌తో 2019లో ప్రారంభమైన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పీవీ సింధు పొందారు.

2022లో అత్యధికంగా సంపాదించిన ప్రపంచంలోని మహిళా క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితాలో... పీవీ సింధు 12వ స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)