బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ మీరాబాయి చాను
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా సైఖోమ్ మీరాబాయి చాను 2021లో క్రీడా రంగంలో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో రజత పతకాన్ని, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని ఆమె గెలుచుకున్నారు.
రియో గేమ్స్‌లో బరువు ఎత్తడంలో విఫలమైనప్పటి నుంచి అంటే 2016 నుంచి ఆమె పట్టు వదలని దీక్షతో పతకం కోసం ప్రయత్నించారు. వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా తనని తాను నిరూపించుకున్నారు.
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మీరాబాయి చాను జన్మించారు. టీ దుకాణపు యజమాని కూతురు ఆమె. తన క్రీడా జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీరాబాయి చాను ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ, ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగేందుకు ఆమెను తనకెదురైన అడ్డంకులన్నింటిని అధిగమించారు. 2021లో కూడా మీరాబాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- అఫ్గానిస్తాన్- బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్
- గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని షేక్ చేసిన హిండెన్-బర్గ్ కథ ఏంటి, దాన్ని నడిపే అండర్సన్ ఎవరు-
- ‘దేశం కోసం ఫుట్-బాల్ ఆడాను.. కానీ, ఇప్పుడు సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్నాను’
- మాంటిస్సోరి స్కూల్- ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన విద్యా విధానం ఇదేనా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)