మోర్బీ బ్రిడ్జి: 'బ్రిడ్జి కూలినప్పుడు నేను, నా చెల్లి బ్రిడ్జి మీద ఉన్నాం. నేను బతికి బయటపడ్డాను. కానీ, నా చెల్లెలు ఇంకా కనిపించ లేదు. తనకు ఆరేళ్లు’

ప్రచురణ

'బ్రిడ్జి కూలినప్పుడు నేను, నా చెల్లి బ్రిడ్జి మీద ఉన్నాం. నేను బతికి బయటపడ్డాను. కానీ, నా చెల్లెలు ఇంకా కనిపించ లేదు. తనకు ఆరేళ్లు ఉంటాయి. ఆమె కోసమే వెతుకుతున్నాను'' అని ఓ యువకుడు బీబీసీ ప్రతినిధికి తెలిపాడు.

గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం కుప్పకూలిన్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది.

''నిన్న సాయంత్రం నుంచి వెతుకుతున్నా. ప్రభుత్వాసుపత్రికి వెళ్లాను అక్కడ లేదు. చాలాచోట్ల వెతికాను. కానీ కనిపించలేదు'' అని ఓ యువకుడు వివరించాడు.

కూలి పని చేసుకుని జీవించే ఆ యువకుడు బ్రిడ్జికి కొద్ది దూరంలోనే నివాసం ఉంటున్నారు. ఆ రోజులు అన్నాచెల్లెలు, అందరు పర్యాటకుల మాదిరిగానే బ్రిడ్జి మీదకు వచ్చారు. అప్పుడే ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)