You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రిస్తారా?-వీక్లీ షో విత్ జీఎస్
భారత కరెన్సీ మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.
ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేసియాలో కరెన్సీ నోట్ల మీద హిందూ దేవుడైన వినాయకుని బొమ్మను ముద్రించగా లేనిది మనం ఎందుకు చేయలేమని కేజ్రీవాల్ అన్నారు.
ఇండోనేసియా జనాభాలో 85శాతం ముస్లింలు కాగా హిందువులు ఉన్నది రెండు శాతం మాత్రమే. అయినప్పటికీ వినాయకుని బొమ్మను వారి కరెన్సీ మీద ముద్రించారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అటు టీవీ చానెల్స్‌లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది.
అసలు కేజ్రీవాల్ ప్రకటన వెనక మర్మమేంటి? ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్‌లో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)