ఇక్కడ రైతులు నేరుగా యాప్‌‌కే కూరగాయలు అమ్ముతారు

వీడియో క్యాప్షన్, ఇక్కడ రైతులు నేరుగా యాప్‌‌కే కూరగాయలు అమ్ముతారు
ప్రచురణ

ఇక్కడ ఒక రైతు కూరగాయలు పండించి నేరుగా ఒక యాప్‌కు విక్రయిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు మరో 120 మంది రైతులు కూడా ఇలాగే తమ పంటను నేరుగా అమ్ముతున్నారు.

రైతుల నుంచి ఆకుకూరలు, కూరగాయలు సేకరించి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తోంది పొట్లం యాప్.

రైతు కూలీ కుటుంబంలో పుట్టి, బ్రిటన్, కెనడాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన అలమండ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ యాప్ ప్రారంభించారు.

స్థానిక రైతులతో ఒప్పందం చేసుకుని వారి నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)