ఇక్కడ టెన్త్/ఇంటర్ పూర్తి చేస్తే ఆడపిల్లల్ని కుట్టుపని, బ్యూటీపార్లర్ పని నేర్చుకోమంటారు.. ఈ యువతి జడ్జి అవుతున్నారు
హరియాణా నుంచి బీబీసీ ప్రతినిధి ప్రభు ద్యాల్ అందిస్తున్న కథనం.
హరియాణాకు చెందిన రేణు బాలా న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలకు జరిగిన పరీక్షలో మొదటి ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమెకు రెండు సంవత్సరాలున్నప్పుడు తండ్రి మరణించారు. తల్లి వ్యవసాయ కూలీ. రేణు చదువులకైన ఖర్చంతా ఆమె అమ్మమ్మ కుటుంబమే భరించింది.
40వేల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. వారిలో మూడు వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. అందులో 400 మంది ఇంటర్వ్యూకి సెలక్ట్ అయ్యారు. 265 పోస్టుల కోసం 122 మందిని ఎంపిక చేశారు. వారిలో రేణు బాలా ఒకరు.
రేణు బాలా హరియాణా న్యాయ సేవ పరీక్షలు రాశారు. ఆమెకు రెండేళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ఆమె పెంపకం బాధ్యతల్ని మేనత్త, మేనమామ తీసుకున్నారు. జీవితంలో ఆమె అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.
''మానాన్న చనిపోయినప్పుడు నాకు రెండేళ్లు. నాలుగేళ్ల వయసులో నేను, మా అమ్మ మామయ్య వాళ్ల ఇంటికి వచ్చాం. మా మామయ్యే నన్ను చదివించారు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది కాదు. ఆమె వ్యవసాయ కూలీగా పని చేశారు. తొలి ప్రయత్నంలోనే నేను ఉద్యోగానికి ఎంపికయ్యాను. మా టీచర్ గుర్విందర్ పాల్ సింగ్ విద్యార్థులందరికీ సాయం చేశారు'' అని కాబోయే జడ్జి రేణు బాలా బీబీసీతో అన్నారు.
''ఈ ప్రాంతంలో ప్రజలు ఆడపిల్లలు టెన్త్ లేదా ఇంటర్ పూర్తి చెయ్యగానే కుట్టు పని లేదా బ్యూటీ పార్లర్ పని నేర్చుకోవాలని చెబుతుంటారు. ఆడ పిల్లలు చదువుకునేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు తమ కలల్ని సాకారం చేసుకోవడంలో తల్లిదండ్రులు అండగా ఉండాలి'' అని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి:
- గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు? శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఎందుకు తెరుస్తారు?
- SAvZIM: దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోందా? విజయానికి 13 పరుగుల దూరంలో జింబాబ్వేతో మ్యాచ్ ఎందుకు ఆగిపోయింది?
- 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ
- విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు... వైరల్ అవుతున్న ఫోటోలు
- రిషి సునాక్: బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి హిందూ ప్రధాన మంత్రి - జీవిత ప్రస్థానం ఫొటోల్లో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)