ఓరి దేవుడా: ఒకే సినిమాలో రెండు ప్రేమకథలు, మధ్యలో దేవుడి ఎంట్రీ అదే ట్విస్ట్
హాయ్ వెల్కంటు మూవీ రివ్యూ.. విష్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఓరి దేవుడా సినిమా తమిళ రీమేక్. 'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాని ఓరి దేవుడా పేరుతో తెలుగులో తీసుకొచ్చారు డైరెక్టర్ అశ్వత్ మారిమత్తు.
ప్రేమకథలో ఫ్రెండ్ షిప్ మిక్స్ చేసి, దేవుడ్ని కూడా తీసుకొచ్చి ఫిలాసఫీ టచ్ ఇచ్చాడు. ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత వారి జీవితంలో జరిగే సంఘటనలు.. దేవుడి పాత్రలో దిగివచ్చే వెంకటేశ్ ఎలాంటి పరిష్కారం చూపిస్తాడు అనేది సినిమా కథ. మిథిలా పార్కర్, అర్జున్ దుర్గరాజు పాత్రల్లో అను పాల్ రాజ్, విష్వక్ సేన్ కనిపిస్తారు. ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారడం, ఆ తరువాత విడిపోవడం చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఇక్కడ దేవుడి పాత్రని కథలోకి తీసుకురావడం అనే ఫాంటసీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సరదాగా సాగిపోయి, ద్వితీయార్థంపై క్యూరియాసిటీని పెంచింది.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- మురిగిపోయిన కరోనా వ్యాక్సీన్లు.. 10 కోట్ల డోసుల టీకాలను పారేసిన సీరమ్ సంస్థ
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)