హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆపారంటూ తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని
ప్రచురణ
ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో ఓ వ్యక్తి ఇలా రోడ్డు పైనే తన సొంత బైక్‌ను తగులబెట్టాడు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఈ ఘటన జరిగింది.
మహేష్ రాంగ్ రూట్‌లో వచ్చారని, అందుకే తాము ఆపామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.
బైక్‌ను ఆపారన్న కోపంతో మహేష్ తన షాపులోకి వెళ్లి పెట్రోల్ తెచ్చి బైకుపై పోసి తగలబెట్టారని పోలీసులు తెలిపారు.
రాంగ్ రూట్‌లో వచ్చినందుకు చలానా రాస్తే కట్టేవాడినని, బైక్ తాళాలు లాక్కోవడంతో దాన్ని తగలబెట్టానని మహేష్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులకు, బైక్ యజమానికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
మండుతున్న బైక్‌ను పోలీసులు ఆర్పారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)