Cup of Life: మగాళ్లకు పీరియడ్స్ నొప్పులు ఎందుకు వస్తున్నాయి?

ప్రచురణ

భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలసరి గురించి మాట్లాడడం.. ఆ సమయంలో కలిగే నొప్పి, బాధ బయటకు వ్యక్తం చేయడం ఇప్పటికీ నిషిద్ధమే.

అది చేయకూడదని పనిగా చూస్తుంది సమాజం.

ఈ ఆలోచనలను మార్చేందుకు ఓ వినూత్న ప్రయత్నానికి నాంది పలికారు కేరళకు చెందిన కొందరు.

ఎర్నాకుళానికి చెందిన ఒక గ్రూపు.. నెలసరి సమయంలో కలిగే నొప్పిని కృత్రిమంగా అందించే యంత్రాలను (సిమ్యులేటర్లు) మాల్స్, కాలేజీలకు తీసుకెళ్లి పురుషులకు ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

పీరియడ్స్ గురించి నిస్సంకోచంగా, బహిరంగంగా చర్చించే పరిస్థితి తీసుకురావాలన్నదే వారి ధ్యేయం.

ఈ ప్రచారానికి సంబంధించిన ఒక వీడియోలో పురుషులు నొప్పితో మెలికలు తిరిగుతూ కేకలు పెడుతుంటే, మహిళలు నవ్వుతూ వాళ్లను చూస్తూ నిల్చున్నారు.

ఈ కథనం పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)