ఈ చిరుతలు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాయంటే

వీడియో క్యాప్షన్, ఈ చిరుతలు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాయంటే
ప్రచురణ

ఈ వీడియో నాసిక్‌ జిల్లా సిన్నర్ తాలూకాలోని సాంగ్వీ గ్రామంలో తీశారు. ఘుమరే కుటుంబ సభ్యులు ఈ వీడియో తీశారు.

వారి ఇంటి వెనుక మొక్కజొన్న పొలాల గట్టుపై ఈ చిరుతలు కనిపించాయి. మొదట ఒక చిరుత పులి కొబ్బరిచెట్టు ఎక్కుతూ కనిపించింది.అది కిందికి దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో చిరుత కూడా అదే చెట్టుపైకి ఎక్కింది.

చిరుతపులి ఇలా నిట్టనిలువుగా చెట్టు ఎక్కుతూ కనిపించడం చాలా అరుదు.

కాసేపటి తర్వాత ఈ రెండు చిరుతలూ అక్కడ నుంచి వెళ్లిపోయాయి. తర్వాత పులుల గురించి ఘుమరే అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.అటవీశాఖ అధికారులు పులుల కోసం ఇక్కడ బోన్లు ఏర్పాటు చేశారు.ఈ రెండు చిరుతలూ స్థలం కోసం పోరాడాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)