ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మరణాలు... ఎవరిదీ పాపం?

ప్రచురణ

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు మరణించారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేరువేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మమతా, సుష్మలు ఆదివారం సాయంత్రమే మృతి చెందారు. మౌనిక సోమవారం చనిపోయారు. లావణ్య అనే 26 ఏళ్ల మహిళ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.

ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అక్టోబర్ 10వ తేదీలోగా సమగ్ర నివేదికను అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)