Art హైపర్ రియలిజమ్‌: అత్యంత వాస్తవికంగా కనిపించే ఇది పెయింటింగా.. ఫోటోనా

ప్రచురణ

తమిళనాడుకు చెందిన వరుణ గతేడాది ఏప్రిల్‌లో ఓ ఫిల్టర్ కాఫీని పెయింట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాంతో అది ఫోటోనా, పెయింటింగా.. అని అయోమయంలో పడ్డారు నెటిజన్స్. రకరకాల స్టైల్స్‌లో బొమ్మలు వేశాక ఇప్పుడు హైపర్ రియలిజమ్‌పై దృష్టి పెట్టారు

ఈ 21 ఏళ్ల యువతి. అత్యంత వాస్తవికంగా కనిపించేలా బొమ్మలు వేయడాన్నే హైపర్ రియలిస్టిక్ ఆర్ట్ అంటారు.

తన కళావస్తువుగా ఆమె ఆహారాన్ని, ముఖ్యంగా తమిళనాడు ఫుడ్‌ను ఎంచుకున్నారు.

మరిన్ని విశేషాలు బీబీసీ ప్రతినిధి అష్ఫాక్ అహ్మద్, జెరిన్ శామ్యూల్ అందిస్తున్న కథనంలో చూద్దాం..

నేను హైపర్ రియలిస్టిక్ పెయింటర్‌ని. నాకు ఫుడ్ పెయింటింగ్‌పై ఆసక్తి ఎక్కువ. రెండేళ్ల వయసు నుంచే నేను బొమ్మలు వేస్తున్నాను. నా పేరు వరుణ.

రెండవ ఏటనే నేను బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేయడం మొదలు పెట్టాను. నేను కాన్వాస్, పేపర్, ఆయిల్ పెయింటింగ్, ఆక్రిలిక్ వంటి అన్నింటిపై పెయింటింగ్‌లు వేస్తుంటాను. ఓ గ్రూప్ షోతో నా మొదటి ప్రదర్శన నాల్గవ ఏటన జరగగా, సోలో షోని ఆరవ ఏటన ఇచ్చాను.

నా ఎనిమిదవ ఏట కోరల్ అకాడెమీలో ఓ ఏడాది పాటు డిజిటల్ పెయింటింగ్‌లో శిక్షణ పొందాను. అప్పుడు ఓ పరీక్షకు హాజరయ్యాను. యంగెస్ట్ కోరల్ సర్టిఫైడ్ డిజైనర్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్ అనే టైటిల్ ఇప్పటికీ నాపేరు మీదే ఉంది.

నేను డిజిటల్‌లోనూ, మాన్యువల్‌గానూ పెయింటింగ్‌ చేస్తూ నా ప్రతిభను మెరుగుపర్చుకుంటూ కొత్త స్టైల్స్‌ పట్ల ఆసక్తి చూపుతున్నాను. ఇప్పటికి 13 పెయింటింగ్ ప్రదర్శనలు ఇచ్చాను.

గత రెండేళ్లుగా కొత్త విధానాల్ని, కొత్త పద్ధతుల్ని వెతుకుతున్నాను. అందులో హైపర్ రియలిస్టిక్ ఫుడ్ పెయింటింగ్ ఓ భాగం.

మొదట నేను వేసిన ఫిల్టర్ కాఫీ పెయింటింగ్‌ను సోషల్ మీడియాలో పెడితే అది బాగా వైరల్ అయ్యి, 60 వేల లైకులు వచ్చాయి. సెలబ్రిటీలు కూడా షేర్ చేయ్యడంతో అది పెద్ద హిట్ అయ్యింది.

ఆ ఆనందంతో మసాలా దోశ, ఇడ్లీ సాంబార్‌, సౌత్ ఇండియా మీల్స్ లాంటి మరిన్ని ఫుడ్ పెయింటింగ్స్ వేశాను. దాంతో మన కళాకృతులతో రోజువారీ ఆహారాన్ని ఇంకెంత వాస్తవికంగా ప్రదర్శించగలమో అని ఆలోచించడం మొదలుపెట్టాను. దాన్ని ప్రజలు మరింత ఆదరించారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు వీటిని తమ ఇళ్లలో పెట్టుకోవడం కోసం ఆర్డర్లు ఇచ్చేవారు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రస్తుతానికైతే తమిళనాడు ఆహార పదార్థాల హైపర్ రియలిస్టిక్ పెయింటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)