హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.

వీడియో క్యాప్షన్, హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.
ప్రచురణ

హిమాలయాల్లోని సియాచిన్‌లో 1984లో గల్లంతైన భారత జవాన్‌ చంద్రశేఖర్‌ హర్బోలా ఆచూకీని 38 సంవత్సరాల తరువాత గుర్తించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో 1984లో చంద్రశేఖర్ సహా 20 మంది సైనికులు ఆపరేషన్ మేఘదూత్‌లో పాల్గొన్నారు.

భారత-పాకిస్తాన్ బోర్డర్‌లోని ఈ ప్రాంతంలో మే 29న ఏర్పడిన హిమపాతం (అవలాంచ్)లో భారత సైనికులు చిక్కుకున్నారు.

వారిలో 15 మంది మృతదేహాలను వెలికితీశారు. అయిదుగురి ఆచూకీ తెలియలేదు. వారిలో చంద్రశేఖర్ ఒకరు.

ఈ ఘటన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)