మహారాష్ట్ర: బండరాళ్లపై ప్రముఖుల చిత్రాలు.. స్టోన్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటున్న యువకుడు

వీడియో క్యాప్షన్, బండరాళ్లపై ప్రముఖుల చిత్రాలతో అబ్బుర పరుస్తున్న మహారాష్ట్ర యువకుడు
ప్రచురణ

రాళ్లకు ఓ కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సుమన్ దాభోల్కర్.

ముంబయిలో ఉండే ఈ కళాకారుడు తన స్టోన్ ఆర్ట్ ద్వారా ఈ రాళ్లకు కొత్త ముఖాకృతినిస్తున్నారు.

రాళ్లను ఉపయోగిస్తూ కళాసృష్టి చేయాలనే ఆలోచనతో ఈయన కోవిడ్ కాలంలో పని మొదలుపెట్టారు.

ఏ భాషలోనైనా రాయి లేదా బండ అంటే ఓ రకంగా మొండితనాన్ని సూచించే మాటగానే ఉంటుంది. కానీ సుమన్ ఆ అర్థాన్ని మార్చాలనుకున్నారు.

సుమన్ దాభోల్కర్ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు పూర్తి చేశారు.

ఇప్పటికి ఆయన 150కి పైగా రాతి కళాఖండాలు సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)