35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త

వీడియో క్యాప్షన్, 35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త
ప్రచురణ

35ఏళ్ల వయసులో తండ్రి కావాలని అనుకునే వారికి నెలలు నిండకుండా శిశువులు పుట్టడం లేదా ఆటిజం పిల్లలు పుట్టే ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది.

వయసు పైబడేకొద్దీ శుక్రకణాల నాణ్యత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

ఇటీవల చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. వీటిలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా పరిశోధన గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి.

దీనిలో భాగంగా 4 కోట్ల మంది పిల్లల జననాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశోధన వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)