చిరుతలు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేస్తున్నాయిలా...

ప్రచురణ

ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే జంతువులుగా పేరుగాంచిన చీతాలు భారత్‌లో అంతరించిపోయి దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ చీతాలు మళ్లీ భారత్‌లో పరుగులు తీయబోతున్నాయి. విదేశాల నుంచి చీతాలను భారత్‌కు తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 16 చీతాలను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోని సుమారు 7వేల చీతాల్లో మూడింట ఒక వంతు నమీబియాలో ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో అనేక ప్రాంతాలలో చీతాలు కనిపిస్తాయి. భారత్‌కు తీసుకొస్తున్న చీతాల్లో చాలావరకు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో గడుపుతున్నవే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో 50కిపైగా కనిపించే నేషనల్ పార్కుల్లో మొత్తంగా 500 చీతాలు ఉన్నాయి.

హెలికాప్టర్ల నుంచి ట్రాంక్విలైజర్స్ ప్రయోగించి, వీటిని పట్టుకున్నారు. ఆ తర్వాత వీటికి మైక్రోచిప్‌లు అమర్చి, ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇచ్చారు. శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు ఐవీలను ఎక్కించారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం వీటి రక్త నమూనా తీసుకున్నారు. చివరగా బోనుల్లో పెట్టి క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లారు.

భారత్‌లో అటవీ ప్రాంతం తగ్గిపోతుండటంతో ఈ చీతాలు ఇక్కడ మనుగడ సాగించలేవని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కూనో నేషనల్ పార్క్‌లో 20 చీతాలు జీవించేందుకు అవకాశముందని, వాటి మనుగడకు అనువైన పరిస్థితులున్నాయని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ యాదవేంద్రదేవ్ ఝాలా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)