Amarnath యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే Raja Singh: ‘నేను, నా కుటుంబం సేఫ్.. కళ్లముందే టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి’
అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, సుమారు 40 మంది గల్లంతయ్యారని ఏఎన్‌ఐ తెలిపింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలు లేవని, వర్షం పడుతూనే ఉందిగానీ, సహాయక చర్యలకు ఆటంకం లేదని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వల్ తెలిపినట్టు ఏఎన్ఐ వెల్లడించింది.
నాలుగు NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, భారత ఆర్మీ, SDRF, CRPF, ఇతర బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని డీజీ తెలిపారు.
కాగా, తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ కూడా అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని చెప్పారు.

‘‘తెలంగాణ ప్రజలు, హిందువుల ఆశీర్వాదం వల్ల నేనూ, నా కుటుంబం అమర్‌నాథ్ యాత్ర పూర్తి చేసుకుని, శ్రీనగర్‌కు తిరిగి వచ్చాం. నిన్న నేను అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఇలాంటి పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. భారీ వరద వచ్చింది. టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి. మేం భోజనం చేసిన ప్రాంతం కూడా సర్వనాశనం అయిపోయింది.
మేం కూర్చుని కొంతమందితో మాట్లాడామో అది కూడా కొట్టుకుపోయింది. గుడి ప్రాంగణం కిందే వేల సంఖ్యలో టెంట్లు ఉన్నాయి. అక్కడే కొందరు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొందరు టెంట్లలో అన్నదానం చేస్తున్నారు. అక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అవన్నీ కొట్టుకుపోయాయి. నా జీవితంలో ఇలాంటి వరదను నేను చూడలేదు. సైనికులు చాలామంచి పనిచేశారు. చాలామందిని కాపాడారు. ప్రతి 10 అడుగులకు ఒక సైనికుడు ఉన్నారు. వాళ్లవల్లే ఎక్కువ ప్రాణహాని జరగలేదు. వాళ్లే భక్తులను ముందుగానే హెచ్చరించారు’’ అని రాజాసింగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్‌నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
- ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
- గొటాబయ రాజపక్ష: అధికారిక నివాసం వదిలేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
- Investment: మ్యూచువల్ ఫండ్స్ నుంచి రుణం తీసుకొని ఇల్లు కొనుక్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




