లక్షల రూపాయల బంగారాన్ని పారేసుకుంటే... ఎలుకలు తెచ్చిచ్చాయి
ప్రచురణ
పోలీసులు ధైర్యంగా, చాలా తెలివిగా దొంగలను వెంటాడి పట్టుకుంటారని మనం చాలా సార్లు చదివి ఉంటాం. కానీ ముంబయి పోలీసులు మాత్రం ఎలుకల సాయంతో, పోయిన రూ.5 లక్షల రూపాయల బంగారం జాడ కనిపెట్టారు.
ఈ ఘటన ముంబయి గోరేగావ్‌లో జరిగింది. సుందరి పళనివేల్ అనే మహిళ తన 100 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో భద్రపరిచేందుకు బయలుదేరారు. వెళ్లేటప్పుడు ఇంట్లో మిగిలిపోయిన వడాపావ్‌లను రోడ్డు మీద ఎవరైనా యాచకులకు ఇచ్చేద్దామని పట్టుకున్నారు. కానీ అలా వడాపావ్‌లు ఇచ్చే సంచిలోనే అనుకోకుండా బంగారం కూడా పెట్టేసి, వారికి ఇచ్చేశారు.
అలా పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు రెండు రోజుల్లో పట్టి తెచ్చి ఆమె చేతిలో పెట్టారు. ఈ విజయం వెనుక ఓ ఎలుక సాయం ఉంది.
అదేంటో... మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- అగ్నిపథ్ నిరసనలు - దామెర రాకేశ్: 'ఆందోళన చేస్తే కాల్చి చంపుతారా?' - కన్నీరుమున్నీరైన దబ్బీర్‌పేట
- బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్
- చైనాకు అమెరికా మీద ఎందుకంత కోపం... అసలేమిటీ తైవాన్ వివాదం?
- లాహోర్‌లోని హిందువుల రాగి, ఇత్తడి వస్తువులతో తయారు చేసిన ఫిరంగులను అఫ్గాన్ పాలకులు ఎక్కడ ఉపయోగించారు?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)