సహారన్‌పూర్: నిర్దోషులను పోలీసులు అమానుషంగా హింసించారంటున్న కుటుంబాలు

వీడియో క్యాప్షన్, నిర్దోషులను పోలీసులు అమానుషంగా హింసించారంటున్న కుటుంబాలు
ప్రచురణ

పోలీసు కస్టడీలో కొందరు యువకులను లాఠీలతో క్రూరంగా బాదుతున్న ఒక వీడియోను ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవరియా ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో దీన్ని లక్షలాది మంది చూశారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుల కుటుంబాలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాయి.

నిర్దోషులైన తమ వాళ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొట్టారని వారంటున్నారు.

మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, సహారన్‌పూర్‌లో గత శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల తర్వాత ఈ యువకులను అరెస్ట్ చేశారు.

సహారన్‌పూర్ నుంచి బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా అందిస్తున్న కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)