బుందేల్‌ఖండ్: ‘నాకు 35 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు.. నీళ్లు లేవని పిల్లను ఇవ్వట్లేదు’

వీడియో క్యాప్షన్, నీళ్లు లేని బుందేల్‌ఖండ్ గ్రామాలకు తమ కూతుళ్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ సిద్ధపడటం లేదు
ప్రచురణ

ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉండే బుందేల్‌ఖండ్ ప్రాంతం నీటి కొరత కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది.

ఇక్కడ టెంపరేచర్ 50 డిగ్రీల వరకూ వెళ్తుంది. చాలా తక్కువ వర్షపాతం కారణంగా ఈ కొండ ప్రాంతంలో కరవు కరాళనృత్యం చేస్తూ ఉంటుంది.

దీంతో చాలా గ్రామాల్లో మగవాళ్లకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. నీళ్లు తేవడానికి మహిళలు చాలా దూరం నడవాల్సి ఉండటంతో ఎవరూ తమ కూతుళ్లను ఈ గ్రామాల యువకులకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడటం లేదు.

ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి గ్రామానికి నల్లాల ద్వారా నీళ్లు అందించాల్సి ఉంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో కూడా నల్లాలు బిగిస్తున్నారు కానీ అందులోకి నీళ్లు ఎక్కడి నుంచొస్తాయి?

వాటర్ సిరీస్‌లో భాగంగా ఈ చివరి కథనాన్ని బీబీసీ ప్రతినిధులు దివ్య ఆర్య, కషిఫ్ సిద్దీఖీ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)