ముక్కుతో ఫ్లూట్ వాయిస్తున్న గుజరాతీ కళాకారుడు
కిషన్ మార్వాడీ….. 43 ఏళ్ల ఈ గుజరాతీ కళాకారుడు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ పేదబస్తీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు కిషన్. వేణునాదాన్ని నోటితోనే కాదు ముక్కుతో కూడా పలికించడం ఈయన ప్రత్యేకత. రోడ్లమీద, నగరాల్లో, గ్రామాల్లో పిల్లనగ్రోవిని వాయిస్తూ పూట గడుపుకుంటున్న ఆయన కథేంటో ఆయన మాటల్లోనే..
నా పేరు కిషన్. నేను సురేంద్రనగర్‌లో ఉంటాను. నేను ఫ్లూట్‌ని నోటితో, ముక్కుతో కూడా వాయిస్తాను. భజనలు, హారతి, గర్బా ఇలా అన్ని పాటలు వాయిస్తాను.
సురేంద్రనగర్ జిల్లా, దుద్రేజ్ ప్రాంతంలోని ఓ బస్తీలో నేను నా భార్య, పిల్లలతో ఉంటున్నాను.
నగరాల్లో, వివిధ గ్రామాల్లో, రోడ్ల పక్కన నేను ఫ్లూట్ వాయిస్తాను.
నేను సంపాదించిందంతా అద్దె కట్టడానికి, నా కుటుంబ పోషణకే సరిపోతుంది.
నాకు సొంతిల్లు లేదు. నేను పేదవాణ్ని. నాకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
నా చిన్నప్పుడు గ్రామాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండే వాణ్ణి. నాకు ఫ్లూట్ అంటే ఇష్టం. ఒకరోజు దానిని కొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. క్రమంగా వాయించడం నేర్చుకున్నాను.
దీనిని ఆస్వాదించడానికి ప్రజలు తమ ఫంక్షన్లకు, కార్యక్రమాలకు పిలుస్తున్నారు. ఎవరూ పిలవకపోతే రోడ్లమీదే వాయిస్తాను.
నేను ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టి 30 ఏళ్లు దాటింది.
చిన్నచిన్న గ్రామాలకు వెళ్లి అక్కడి వాళ్లను నా కళతో అలరిస్తాను. వాళ్లిచ్చే డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
ఇవి కూడా చదవండి:
- మహిళలు నడిపే ఈ రోడ్డుపక్క ఇడ్లీ కొట్టు ఇంత ఫేమస్ ఎలా అయ్యింది?
- గాలిలేని, పంక్చర్లు పడని టైర్లు వచ్చేస్తున్నాయి.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..
- ముస్లింల అణచివేతను ఆపండి అంటూ భారత్‌ను కోరిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
- ప్రభుత్వం బుల్డోజర్తో ఇళ్లను కూల్చేయవచ్చా? చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా?
- ఖదీజా: ఇస్లాం మతం పుట్టుకలో కీలక పాత్ర పోషించిన మహిళ కథ
- పాకిస్తాన్: 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)