నీటి కోసం గ్రామీణ మహిళల పడుతున్న అంతులేని కష్టాలకు తెర పడుతుందా?

ప్రచురణ

గ్రామాల్లో నివసించే దాదాపు 20 కోట్ల కుటుంబాల్లో.. మహిళలు మైళ్ల దూరం నడిచి లేదా లైన్లలో గంటల తరబడి నిలబడి నీటిని మోసుకొస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు, 2019లో జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించింది మోదీ ప్రభుత్వం.

ఇప్పటికి 10 కోట్ల ఇళ్లల్లో నల్లాలు బిగించామని ప్రభుత్వం చెప్తోంది.

మరి ఈ పథకం అమలులో ఎదురవుతున్న సవాళ్లేంటి?

నీటి కొరత బాగా ఉన్న మూడు ప్రాంతాల్లో బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య పర్యటించారు.

ఆమె మొదటి మజిలీ.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతమైన బాడ్మేర్ ప్రాంతం.

ఎడారి ప్రాంతంలోని ఇళ్లకు నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)