ఛత్తీస్‌గఢ్: లక్షా 70 వేల హెక్టార్ల అడవి నరికివేతకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు

వీడియో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్: లక్షా 70 వేల హెక్టార్ల అడవి నరికివేతకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు
ప్రచురణ

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సర్గుజా జిల్లాలో ఉన్న హస్‌దేవ్ అటవీ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ దశాబ్ద కాలంగా జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మరింత పుంజుకుంది.

ప్రస్తుతం అక్కడ కెట్ బార్సెన్ కోల్ ప్రాజెక్టు రెండో దశ తవ్వకాలకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.

స్థానిక ఆదివాసుల నిరసనల మధ్యే జిల్లా యంత్రాంగం చెట్ల నరికివేతను మొదలుపెట్టింది.

హస్‌దేవ్ అటవీ ప్రాంతం సుమారు లక్షా 70 వేల హెక్టార్లలో విస్తరించింది ఉంది.

బొగ్గు తవ్వకాలతో ఆ అడవి నాశనమైపోవడమే కాకుండా, అందులో నివసించే జీవజాలానికి కూడా నిలువనీడ లేకుండా పోతోంది.

బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)