డోలు వాయిస్తూ అందరిచేత శభాష్ అనిపిస్తున్న అక్కాచెల్లెళ్లు

వీడియో క్యాప్షన్, డోలు వాయిస్తూ అందరిచేత శభాష్ అనిపిస్తున్న అక్కాచెల్లెళ్లు
ప్రచురణ

శివకలై, కలైవాని అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు కల్లాకురిచిలో ఉంటారు.

ఒకరు 8వతరగతి, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ అరుదైన ఘనతను సాధించారు.

దక్షిణాది సంప్రదాయ సంగీతం వాయిద్యమైన డోలును వాయించడం నేర్చుకున్నారీ అమ్మాయిలు.

సాధారణంగా డోలు మగవారే వాయిస్తుంటారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇప్పటికే అనేక పెళ్ళిళ్లు, సంగీత కార్యక్రమాల్లో డోలు వాయిస్తూ అందరిచేత శభాష్ అనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)