ఏనుగుపై పెళ్లి కూతురు, చేతిలో పెన్ను, పక్కనే అంబేడ్కర్ ఫోటో... ఇలా ఎందుకంటే

వీడియో క్యాప్షన్, ఏనుగుపై పెళ్లి కూతురు, చేతిలో పెన్ను, పక్కనే అంబేడ్కర్ ఫోటో... ఇలా ఎందుకంటే
ప్రచురణ

ఎద్దుల బండి నుంచి హెలీకాప్టర్ వరకు, వధువును ఘనంగా వివాహ వేదిక దగ్గరికి చేర్చే దృశ్యాలను మీరు ఎన్నో చూసి ఉంటారు. అయితే, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా, వాధ్వన్ పట్టణంలో ఓ విశేషమైన వివాహం జరిగింది.

పెళ్లి ఊరేగింపులో వధువు ఏనుగు మీద కూర్చుంది. అదొక్కటే కాదు, ఊరేగింపులో ఆమె పెన్ను పట్టుకుని కనిపించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కూడా పట్టుకుని కనిపించింది.

పెళ్లి కూతురు భారతి పర్మార్ వివాహ వేడుకలో జరిగిన ఈ చర్య గుజరాత్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ కార్యక్రమాన్నంతా భారతి తల్లిదండ్రులు ప్లాన్ చేయగా, సంభ్రమాశ్చర్యాలతో భారతీ పర్మార్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)