'మతాంతర వివాహం చేసుకున్నామనే మా ఇల్లు కూలగొట్టారు'

వీడియో క్యాప్షన్, 'మతాంతర వివాహం చేసుకున్నామనే మా ఇల్లు కూలగొట్టారు'
ప్రచురణ

ఆసిఫ్ ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదంటూ మధ్యప్రదేశ్ అధికారులు ఏప్రిల్ 8న కూల్చేశారు. దీనిపై బీబీసీ ప్రశ్నించినప్పుడు స్థానిక అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా కలెక్టర్ దీనిపై ట్వీట్ చేశారు. ''ఆసిఫ్ ఖాన్ ఇల్లు, దుకాణాలను అధికారులు కూల్చేశారు. గత రెండు రోజులుగా అసిఫ్ ఖాన్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరమా? అసలేం జరిగింది...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)