కేరళలో ఒక టూవీలర్‌ను ఢీకొన్న కారు దూసుకెళ్లి బావిలో పడింది... ఆ తర్వాత?

వీడియో క్యాప్షన్, కేరళలో బావిలో పడిన కారు.. ఆ తర్వాత?
ప్రచురణ

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా ఉడ్మాలో ఒక టూవీలర్‌ను ఢీకొన్న కారు నేరుగా వెళ్లి ఒక బావిలో పడిపోయింది.

ఒక మసీదుకు చెందిన ఆ బావి లోతు ఏడు మీటర్లు, దానిపైన ఒక షీట్‌తో కప్పి ఉంచారు.

స్థానికులు వెంటనే ఆ బావిలోకి దిగి కారులోని ముగ్గురు పిల్లలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.

కారును బయటకు తీసిన సమయంలో 48 ఏళ్ల అబ్దుల్లా నజర్ కారులోనే ఉన్నారు.ప్రమాదం జరిగిన అరగంటలోపే కారులో ఉన్న అందరినీ సురక్షితంగా కాపాడగలిగామని, కారును కూడా బావిలోనుంచి బయటకు తీయగలిగామని బేకల్ డిప్యూటీ ఎస్పీ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)