రేపల్లె రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ ఘటనపై బాపట్ల ఎస్పీ ఏమన్నారు?
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాపట్ల జిల్లా రేపల్లెకి వలస వెళ్లింది.
కూలి పనులు చేసుకుంటూ గడుపుతోంది. శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు తెగబడ్డారు.
భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి చీకట్లో నిర్మానుష్యంగా ఉన్న సమయంలో స్టేషన్ లోనే ముగ్గురు దుండుగులు అఘాయిత్యానికి పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు.. భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి నిందితులు పరారయినట్టు చెబుతున్నారు.
సీసీ ఫుటేజ్ సహా అక్కడ లభించిన ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆ తరువాత బాపట్ల ఎస్పీ వకుళ్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ, "ఈ కేసులో ఒక మైనర్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)