నవనీత్ కౌర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఏమిటి? ముంబయిలో ఏం జరిగింది
మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని, దమ్ముంటే తనను ఆపాలని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా.. ఆ ఆందోళనను విరమించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
అంతకుముందు.. శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు రానా దంపతులు మాతోశ్రీ వద్దకు వస్తే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని శివసేన నాయకురాలు, ముంబయి నగర మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు.
''వారి కోసం మేం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే గుణపాఠం చెబుతాం'' అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలపై నవనీత్ కౌర్ స్పందిస్తూ.. ''మాకు అవరోధాలు సృష్టించాలని శివసేన కార్యకర్తలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. అందుకే వారు బారికేడ్లు తోసుకుని వస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కచ్చితంగా మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతాను'' అని ఉద్ఘాటించారు.
కానీ మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత రానా దంపతులు.. హనుమాన్ చాలీసా ఆందోళనను విరమించుకుంటున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో పీహెచ్డీ చేసిన ఈ తెలంగాణ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా దిల్లీ బాబా దగ్గరికి ఎందుకొచ్చారు?
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


