You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒడిశా: జనాలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, 20 మందికి పైగా గాయాలు
ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఒకరు బీజేడీ కార్యకర్త, ఏడుగురు పోలీసులు ఉన్నారు.
పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్ బ్లాక్ ఆఫీస్ ముందు గుమిగూడిన ప్రజలపై ఎమ్మెల్యే కారు దూసుకెళ్లింది.
దాంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను పోలీసులు భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా పోలీసులు తెలిపారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో జగ్దేవ్ను పార్టీ నుంచి బీజేడీ సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- కొత్తిమీర సూపర్ ఫుడ్డా? కొత్తిమీరను భారతదేశ జాతీయ మూలికగా ప్రకటించాలని ఈ షెఫ్ ఎందుకు కోరుతున్నారు
- పుతిన్‌ను అవమానిస్తే అణు యుద్ధం తప్పదా? అణు యుద్ధం ప్రమాదాన్ని అంచనా వేయడం ఎలా?
- ప్రేమ జంటల్లో 'భిన్నధృవాల మధ్య ఆకర్షణ' నిజమా? కాదా? విరుద్ధ వ్యక్తిత్వాలు కలుస్తాయా? లేదా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)